AYYAYAYYO SONG LYRICS – CHAAVU KABURU CHALLAGA

 

 

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో
హయ్యో హయ్యయ్యో… ఏంటో ఏంమాయో
నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో

సిట్టి సిరాకు పురుగు… సీతాకోకైనట్టు
రంగుల రెక్కల బతుకే మొదలైందే
మట్టిలో పుట్టిన సిగురు మర్రి సెట్టైనట్టు
మనసు ఆ మబ్బుల దాకా ఎగిరెళ్ళిందే

సముద్రంలో సిందే సేపా… ఎగిసి నింగిని చూస్తున్నట్టు
గుండెకేమో లోకమంతా కొత్తగుందే
బీడు నేల వాన జల్లే… తాకి పచ్చని పొలమైనట్టు
మొదటిసారి సావు కబురే సల్లగుందే

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో
హయ్యో హయ్యయ్యో… ఏంటో ఏంమాయో
నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో

బురదా సెరువల్లే ఉంటాదే మా బతుకే
సిరు కమలాలు పూసాయే ఆ నీటికే
మిణుగు మిణుగురులా సాగే నా కథకి
పున్నమిలోని వెన్నెల్లు వత్తాబులే

నేలపై రాలిన సినుకు… నదుల నురగైనట్టు
పాదమే సెలయేరల్లే తీసే పరుగు
వేసవికి ఎండిన మోడు… పూల కొమ్మైనట్టు
పసితనంతో మొదలయ్యే జన్మే ఇపుడు
ఆటు పోటు అలల్లోన.. తీరం తెలియని పడవై ఉన్న
అంతలోనే ప్రేమదీవై ఎదురయ్యావే
ఈ పొరకోడి గుండెకాయ కదలికే లేనిది అనుకున్న
ఇప్పుడెంటో ఉప్పెనల్లే పొంగుతోందే

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ఆకాశం అంతందం ఎదురయ్యిందయ్యో
హయ్యో హయ్యయ్యో… ఏంటో ఏంమాయో
తలరాత ఓ మలుపు తిరిగేసిందయ్యో
తిరిగేసిందయ్యో… ఓ ఓఓ
అయ్యో అయ్యో… అయ్యో అయ్యో అయ్యయ్యో

Ayyayayyo Song Details

Lyrics : Karunakar Adigarla

Singer : Aditya Tadepalli

Music : Jakes Bejoy

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *