GUNDELONA SONG LYRICS – NAANDHI

గుండెలోనా మండుతోందా… మందు లేని గాయం
ముందరంతా ఉన్నదంతా… అంతు లేని శూన్యం
కరిగెరా కరిగెరా బంధాలన్నీ కలగా
కదలదీ హృదయమే… బండబారె శిలగా
నడిచే… ఎదవు నీవు కదా
గృహమే… శిథిలమాయెనుగా

మురిసిపోయిన జ్ఞాపకాలే… ముసురుకున్నవి నేడిలా
చిగురువేసిన రోజులన్నీ… చెదలు బూజులే ఆయెగా
తిరిగెలే ఇచటనే అమ్మానాన్నలుగా
మిగిలెలే ఇపుడిలా పటము బొమ్మలుగా
బతుకులే చితుకులై… మండాయి ఓ చితిగా
వెలుగునే నిలువునా… మార్చాయి చీకటిగా
ఆఆ… మనసే… పగిలిపోయెనుగా
దిగులే… పొగిలి ఏడ్చెనుగా
కలలే… రగిలిపోయెనుగా
బతుకే…ఏ ఏ… మిగిలే బూడిదగా

Gundelona Song Details

Lyrics : Chaitanya Prasad

Singer : Chaitanya Prasad

Music : Sri Charan Pakala

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *