KOO CHUKU CHUKU SONG lYRICS – IPPUDU KAAKA INKEPPUDU

స్టీల్ ప్లాంట్ దిగువ నుండి… మల్కాపురము మలుపు దాటి
షీలా నగరు సందు దాటి… ఎన్ ఏ డీ చర్చ్ దాటి
కంచెరపాలెం బ్రిడ్జి దాటి… జ్ఞానాపురము టేషను దాకా

భోగాపురము రోడ్డు నుండి… అవంతి కాలేజీ జంక్షన్ దాకా
తగరపువలస బ్రిడ్జి దాటి… మధురవాడ మలుపు దాటి
హనుమతువాక మద్దెలపాలెం తెలుగు తల్లి వంతెన దాటి
దాటి దాటి అలసిపోనావ్ గానీ… ఎక్కడికొచ్చాం సెప్పు మాయ్యా

కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
సరే సరే ఎక్కిద్ధుర్లే కానీ… ఎవర్నేక్కించాలి, ఎందుకెక్కించాలి

సింధియా కుర్రాడు… వీడు బుద్ధిమంతుడు
నాన్నారి మాటలు అస్సలు జవ దాటడు
ఆహా..! రిషికొండ అమ్మాయి… పద్దతిగల పాపాయి
తన తల్లి గీసిన గీతను దాటాలనుకోదు

ఆరిలోవ ముడసల్లోవా… వదిలేసి ఎలిపో బావ
హైటెక్ సిటీకి తోవ చూపిస్తాం దా
ఆసిల్ మెట్ట, మారాని పేట… చుట్టాలకు చెప్పెయ్ టాటా
ప్యాకేజీ భలేగా ఉంటే… నొప్పా సొలుపా
ఉద్యోగం వచ్చింది… వారెవా వారెవా
ఈ విషయం ఊరంతా… విడ్డూరం చేద్దాం దా

లగేజ్ సద్దేయ్ లబ్జెనక
నువ్వు లగెత్తుకెళ్ళిపో లచ్చెనకా
తర్జన భర్జన దేనికి… గబుక్కు గబుక్కు గబుక్కు
గబుక్కు గబుక్కు గబుక్కు గబుక్కు గబుక్కునా

ఏం మీ నాన్న పంపుతాడా..?
అంటే… పంపిచరనుకో, కనకే
కనకమాలక్ష్మమ్మకి, సింహాద్రి అప్పన్నకి
సంపత్తు వినాయకుడికి , రాస్ హిల్స్ యేసయ్యకి
అనకాపల్లి నూకాలమ్మకి, హజరత్ బాబా దర్గాకి

ఓర్ మాయ్యా మొక్కులకి లొంగే రకమా మీ బాబు
ఎలగేస్, మారుపేరు మీద టికెట్ తీద్దాం
గోదారి ఎక్కిచ్చేద్దాం, కరిస్టే, పచ్చ జెండా ఊపండి మరి

కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు

దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం దాటి
అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు, నూజివీడు, విజయవాడ
కంగారైపోకు విజయవాడ జంక్షన్ మరి
గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ
నల్గొండ, రామన్నపేట… నల్గొండ, రామన్నపేట, సికింద్రాబాద్
వచ్చావురా బేటా…
అయ్ బాబోయ్ నేనెళ్ళాల్సింది హైదరాబాద్ కదా..!
జంట నగరాలు అంటారు… చిన్నప్పుడు సదువుకోలేదా..!

కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు

Koo Chuku Chuku Song Details

Lyrics : Sahityya Sagar

Singers : Lokesh, hymath , Shreeja & Kalyani

Music : Sahityya Sagar

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *