Nee Mayalo Padithe Song Lyrics- Ninnila Ninnila

Nee Mayalo Padithe Song Telugu Lyrics

 

నీ నవ్వు చాలంట

నా కంట నీరు మాయం

నీ చూపు చాలంట

ఈ చీకటే మాయం

 

మాటలెన్నున్నా నచ్చే మౌనమే నువ్వు

పాటలా నిన్ను పలికే పెదవి నే నేను

నీ నవ్వు చాలంటా

నా కంట నీరు మాయం

నీ నవ్వు చాలంటా..నీ నవ్వు చాలంటా

 

తీయని నీ పిలుపులు..

నా అడుగుకెన్ని పరుగులు

నువ్వు తాకి చూసే వేళలో

ఒక రంగుకెన్ని రంగులో

క్షణముకెన్ని ఊహలూ

నీ ఊసులే విని మనసులో

ఈ కలలకెన్ని కులుకులో

నా నిదురకెన్ని ఉలుకులో

 

నీ నవ్వు చాలంటా

నా కంట నీరు మాయం

నీ నవ్వు చాలంటా..నీ నవ్వు చాలంటా


ఆ … అలసిపోయే వేళలో

నువ్వు కలిసి ఉంటే చాలులే

ఇక మాయం అవదా అలసటే

మటు మాయం అవదా నిలకడే

ఊహలంటే తెలియదే

నీ ఊసులే విని మనసుకే

ఈ కళలు అంటే తెలియదే

నా నిదుర నిండా నీ కథే

 

మాయమవదా లోకమంతా ..మెరిసిపోదా మానసిలా

నీ మాయలో పడితే ..నీ మాయలో పడితే

మారిపోదా కాలమంతా ..మరపురాని గురుతుల

నీ మాయలో పడితే ..నీ మాయలో పడితే

 

Nee Mayalo Padithe Song Details

Lyrics : SriMani

Singer : Vijay Yesudas, Rajesh Murugesan

Music : Rajesh Murugesan

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *