NEERU NEERU SONG LYRICS – KHADI NO 150

నీరు… నీరు… నీరు… రైతు కంట నీరు…

చూడనైన చూడరెవ్వరూ…గుండెలన్ని బీడు… 

ఆశలన్ని మోడు…ఆదరించు నాథుడెవ్వరూ… 

అన్నదాత గోడు నింగినంటె నేడు…

ఆలకించు వారు ఎవ్వరూ…

నీరు… నీరు… నీరు… రైతు కంట నీరు…

చూడనైన చూడరెవ్వరూ…

గొంతు ఎండిపోయే పేగు మండిపోయే…

గంగతల్లి జాడ లేదనీ… 

నీటి పైన ఆశే నీరుగారి పోయే…

రాత మారు దారి లేదని… 

దాహం ఆరుతుందా…

పైరు పండుతుందా… 

ధారాలైన కంటి నీటితో…

నీరు… నీరు… నీరు… రైతు కంట నీరు…

చూడనైన చూడరెవ్వరూ…గుండెలన్ని బీడు… 

ఆశలన్ని మోడు… ఆదరించు నాథుడెవ్వరూ…

నేల తల్లి నేడు అంగీలారిపోయే… 

మూగబోయే రైతు నాగలి…

ఆయువంతా చూడు ఆర్తనాదమాయే… 

గొంతు కోసుకుంది ఆకలి…

Neeru Neeru Song Details

Lyrics  BY :  Ramajogayya Sastry

Music    :  Devi Sri Prasad

Singer   :  Shankar Mahadevan

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *