OKEY OKA LOKAM SONG LYRICS | SASHI

Okey Oka Lokam Song Lyrics in Telugu

ఒకే ఒక లోకం నువ్వే … లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే … నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే … కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే … ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా … నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా … జన్మజన్మలా జంటవ్వనా

ఓఓ … కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా … ఆఆ
ఓఓ … కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా … ఆఆ
నిన్న మొన్న గుర్తే రాని … సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి … ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా …

క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే … ఏఏ ఏ ఏ
ఎండే నీకు తాకిందంటే … చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే … వణుకు నాకు పుట్టేనే
దేహం నీది … నీ ప్రాణమే నేనులే

ఒకే ఒక లోకం నువ్వే … లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే … నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే … కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే … ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా … నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా … జన్మజన్మలా జంటవ్వనా

Okey Oka Lokam Song Details & Credits

Lyrics : Chandra Bose

Singer : Sid Sriram

Music : Arun Chiluveru.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *