OYE MEGHAMLA SONG LYRICS – MAJNU

Oye Meghamla Song Telugu Lyrics

ఓయ్..! మేఘంలా తేలిందే నా చిన్ని మనసే
హేయ్..! మిలమిలలా మిణుగురులా మారింది వరసే
కనులకి ఈ రోజిలా అందంగా… లోకం కనిపించెనే నీ వల్ల 
చాలా బావుందే… నీ వెంటుంటే
ఏదో అవుతుందే… నీతో ఉంటే
ఓయ్..! మేఘంలా… తేలిందే నా చిన్ని మనసే
హేయ్..! మిలమిలలా మిణుగురులా మారింది వరసే

కళ్ళగంత కట్టినా… కళ్ళముందు వాలెనే
వింతలన్నీ నువ్వు పక్కనుంటే
పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే… హో ఓ
ఎంత దూరమెళ్లినా… జంటకట్టి వచ్చేనే
కాలి గుర్తులన్ని మనవెంటే
మండుటెండ వెండి వెన్నెలై పూసే

పెదవులు తెలియని రాగం తీసే… ఓఓ
తలుపులు తియ్యని కవితలు రాసే
ఒక ఆశే విరబూసే… నా మనసు పలికేది నీ ఊసే
ఓయ్..! మేఘంలా… తేలిందే నా చిన్ని మనసే
హేయ్..! మిలమిలలా మిణుగురులా మారింది వరసే

చెయ్యిపెట్టి ఆపనా… తిట్టికొట్టి ఆపనా
పరుగుపెట్టేయ్ ఈ నిమిషాన్ని
ఈ క్షణమే శాశ్వతమే అయిపోని… ఓఓ
వెళ్లనివ్వనంతగా హత్తుకున్నాయిగా
ఈ తీపి జ్ఞాపకాలన్నీ
ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకొనీ

ఎంతని ఆపను నా ప్రాణాన్ని, హో ఓ
ఏమని దాచను నా హృదయాన్నీ… నీతోనే చెప్పైనీ
ఈ బయట పడలేని మౌనాన్ని
ఓయ్..! నీవల్లే… గువ్వల్లే ఎగిరింది మనసే 
హేయ్..! ఈరోజే నా కలలో ఉందెవరో తెలిసే 
పుట్టిన ఇన్నాళ్లకా వచ్చేది… వేడుక ఇన్నేళ్లకా తెచ్చేది
చాలా బావుందే నీ వెంటుంటే… ఏదో అవుతుందే నీతో ఉంటే

Oye Meghamla Song Details

Lyrics : Shree Mani

Singer : Chinmayee Sripada

Music : Gopi Sundar

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *