PUDAMIPAINE POOSINA PUVVA SONG lYRICS – BULLET SATYAM

పుడమిపైనే పూసిన పువ్వా… పుడమిలోకే ఒరిగిపోయావా
కానరాని లోకములకే… పయనమై ఇక మూగబోయావా

పుడమిపైనే పూసిన పువ్వా… పుడమిలోకే ఒరిగిపోయావా
కానరాని లోకములకే… పయనమై ఇక మూగబోయావా
కంటనీరే పొంగెనే… గుండెలో తడి ఆరెనే
ఏడు అడుగుల బంధమే… గూడు వదిలిపోయెనే
రాణివాసమే వీడి రాణి… ఇపుడే తరలెను చూడరా
ఒంటరయ్యేనే రాజు… ఒంటరయ్యేనే
దేవా..! ఒంటరయ్యేనే రాజు… ఒంటరయ్యేనే
పుడమిపైనే పూసిన పువ్వా… పుడమిలోకే ఒరిగిపోయావా

వెన్నెలంటి నవ్వులన్నీ మన్నుపాలేనా
వంద ఏళ్ళ ఆశలన్నీ ఆవిరయ్యేనా
విషపు నాగుల కోరలే… విసిరి ఊపిరి తీసెనా
కారుకోకిల రాగమే… గావు కేకలు వేసెనా
రాణివాసమే వీడి రాణి… ఇపుడే తరలెను చూడరా
ఒంటరయ్యేనే రాజు… ఒంటరయ్యేనే
దేవా..! ఒంటరయ్యేనే రాజు… ఒంటరయ్యేనే
పుడమిపైనే పూసిన పువ్వా… పుడమిలోకే ఒరిగిపోయావా

జంట పక్షే వీడిపోయే విధికి లొంగేనా
దిక్కుతోచక మధ్యలోనే పయనమాగేనా
ఇంటి దీపమే ఆరేనా… గుండె చితిమంటాయెనా
నీలి గగనపు వీధిలో… తార ఒకటి చేరెనా
రాణివాసమే వీడి రాణి… ఇపుడే తరలెను చూడరా
ఒంటరయ్యేనే రాజు… ఒంటరయ్యేనే
దేవా..! ఒంటరయ్యేనే రాజు… ఒంటరయ్యేనే
పుడమిపైనే పూసిన పువ్వా… పుడమిలోకే ఒరిగిపోయావా
కానరాని లోకములకే… పయనమై ఇక మూగబోయావా

Pudamipaine Poosina Puvva Song Details

Lyrics : Rambabu Gosala

Singer : Chalaki Chanti

Music : Vinod Yajamanya

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *