TELUSA MANASA SONG LYRICS – CRIMINAL

Telusa Manasa Song Telugu Lyrics

తెలుసా మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా… ఇది ఏ జన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు… వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా… ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతి క్షణం…హు హు మూ…  నా కళ్ళలో… నిలిచె నీ రూపం
బ్రతుకులో… ఓ ఓ… అడుగడుగున నడిపె నీ స్నేహం

ఊపిరే నీవుగా… ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను… నీ ప్రేమ సాక్షిగా

తెలుసా మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా… ఇది ఏ జన్మ సంబంధమో

డార్లింగ్, ఎవ్రీ బ్రీథ్ యూ టేక్… ఎవ్రీ మూవ్ యూ మేక్
ఐ విల్ బీ దేర్… వాట్ ఉడ్ ఐ డూ వితౌట్ యూ…?
ఐ వాంట్ టూ లవ్ యూ ఫరెవర్
అండ్ ఎవర్… అండ్… ఎవర్

ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో…ఓ ఓ… తీగసాగే మల్లెగా అల్లుకో

లోకమే మారినా… కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ

తెలుసా మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా… ఇది ఏ జన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు… వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా మనసా… ఇది ఏనాటి అనుబంధమో
ఆహా… ఆహా… ఆ హా

Telusa Manasa Song Details

Lyrics : Sirivennela Seetharama Sastry

Singers : S P Balasubramanyam , Chitra

Music : M M Keeravani

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *